తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి

తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, అదనపు ఈవో ఆయనకు సాదర స్వాగతం పలికారు. కాసేపట్లో అన్నమయ్య భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. అంతకుముందు ఢిల్లీ పర్యటన ముగించుకుని రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.