ఢిల్లీ డిప్యూటీ సీఎం కి క‌రోనా

ఢిల్లీ డిప్యూటీ సీఎం కి క‌రోనా

క‌రోనాతో భాద‌ప‌డుతూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆసుప‌త్రిలో చేరారు. ఈనెల 14న మనీశ్ సిసోడియాకు క‌రోనా నిర్ధార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే అప్ప‌టినుంచే ఇంట్లోనే ఐసోలేష‌న్‌లో ఉన్న ఆయ‌న స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌తో ఆసుప‌త్రిలో చేరారు.

ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన‌ప‌డి కోలుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక రాజ‌ధానిలో  పాజిటివ్‌ కేసుల సంఖ్య 2 లక్షల 53 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 3,816 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇప్పటి వరకు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 2,53,075కు చేరింద‌ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో వెల్ల‌డించింది.