మోదీతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

మోదీతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

టీటీడీ అన్నమయ్య భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ కాసేపటి క్రితం ప్రారంభమైంది. కోవిడ్‌కు సంబంధించి 7 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ఈ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి సుచరిత, సీఎస్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

అంతకుముందు పద్మావతి అతిథిగృహంలో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సీఎం జగన్‌ను కలిశారు. పదవీ విరమణ పొందిన మిరాశీ అర్చకుల విషయం ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో ముఖ్యమంత్రిని కలిశామని ఈ సందర్భంగా రమణ దీక్షితులు తెలిపారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం కలిసి మాట్లాడుతానని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు.