టీడీపీకి మద్దతుగా ఏపీ కాంగ్రెస్ !

AP congress to work against bjp and ycp

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సమయం దగ్గరకోచ్చేస్తున్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న అన్ని పార్టీలు, త‌మ పార్టీ బ‌లాన్ని పెంచుకునేందుకు ఇత‌ర పార్టీలో ఉన్న నేత‌ల‌ను త‌మ పార్టీలోకి లాక్కునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ రేసులో జనసేన ముందువరుసలో ఉండగా తమ పార్టీలో ఉండి ఇప్పుడు రాజకీయాలకి దూరంగా ఉంటున్న నేతలను తిరిగి వెనక్కు తెచ్చుకునే పనిలో కాంగ్రెస్ ఉంది. అయితే అలాగే రాష్ట్ర విభ‌జ‌న‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్రంగా న‌ష్ట‌పోయిన కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావాన్ని చూపించేందుకు ప్లాన్ లు సిద్దం చేస్తున్నారు. అందుకే అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక హోదాతో పాటు కాపు రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టిస్తామ‌ని చెబుతూ ప్ర‌జ‌ల్లో బ‌లాన్ని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ap

అయితే నిన్న అనంతపురంలో రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలకి దారి తీస్తోంది. అనంత‌పురం జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య కమిటీ స‌భ్యుల‌తో స‌మావేశ‌మైన ర‌ఘువీరా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌య‌మే ధ్యేయంగా దేశంలో బీజేపీ, ఏపీలో వైసీపీపై పోరాటం చేస్తామంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. అంటే వైసీపీ, బీజేపీలకి వ్యతిరేకంగా అంటే అయితే తెలుగుదేశం లేదా జనసేనలతో కలవాల్సి ఉంటుంది. అయితే జనసేనతో ఎటూ కలవారు కాబట్టి పొట్టు పెట్టుకోకుండా టీడీపీకే మద్దతుగా ఉంటారని భావిస్తున్నారు విశ్లేషకులు.

ap2