ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటోందట

Ap Congress Will Be Active For 2019 Election

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Ap Congress Will Be Active For  2019 Election

ఏపీలో పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ కు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తమ సొంత సర్వేల సంగతి పక్కనపెడితే.. సీఎం చంద్రబాబు కాంగ్రెస్ తో జాగ్రత్త అని తమ్ముళ్లకు హెచ్చరికలు జారీ చేయడం, జగన్ ఏరికోరి తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పుంజుకుంటుందని తేల్చడం ఆ పార్టీకి ఎక్కడలేని హుషారు తెస్తున్నాయి. రాహుల్ సభ తర్వాత సీన్ మారిపోయిందన్న వాదనతో పీసీసీ చీఫ్ రఘువీరా తెగ సంతోష పడిపోతున్నారు.

రఘువీరా ఆనందపడటంలో తప్పులేదు. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఒక్క సీటు వచ్చినా పెద్ద అచీవ్ మెంట్ కిందే లెక్క. అందుకే రఘువీరా ఒక్క సీటొచ్చినా ఏదో సాధించామని చెప్పుకోవడానికి వెనుకాడకపోవచ్చు. కానీ కాంగ్రెస్ పుంజుకుంటోదని చెప్పిన అదే ప్రశాంత్ కిషోర్.. జగన్ కు ఇచ్చిన సలహా చూస్తే మాత్రం కాంగ్రెస్ కు నిద్రలేని రాత్రులు ఖాయమే. ఎందుకంటే బలమైన కాంగ్రెస్ నేతల్ని లాగేయాలనేది కిషోర్ చెప్పిన సూత్రం.

ప్రస్తుతం నంద్యాల ఉపఎన్నికల సన్నాహకాలతో బిజీగా ఉన్న జగన్.. ఎన్నికలవ్వగానే ఈ విషయంపై దృష్టిపెడతారనేది లోటస్ పాండ్ న్యూస్. అదే జరిగితే కాంగ్రెస్ లో ఫేస్ వాల్యూ ఉన్న నేత ఎవరూ మిగలరు. పైగా రఘువీరాపై అసంతృప్తిగా ఉన్న సీనియర్లు బోల్డంతమంది ఉన్నారు. వీరిలో నలుగురు జంపైనా.. తర్వాత ఎన్నికల నాటికి అందరూ జగన్ బాటే పడతారనేది వాస్తవం. కాబట్టి రఘువీరా తాత్కాలిక సంతోషం ఆపేసి.. ముందు వలసల్ని నిరోధించడంపై శ్రద్ధ పెడితే బాగుంటుందేమే.

మరిన్ని వార్తలు

రోజా మారుతుందా… పార్టీనే మార్చేస్తుందా?

తుమ్మితే ఊడే ముక్కుతో ఎంతకాలం పళనీ..?