ఆంధ్ర రంజీ జట్టు పేస్ బౌలర్ యెర్రా పృథ్వీరాజ్ ఐపీఎల్ –13లో గాయపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ స్థానంలోకి వచ్చాడు. ఈ మేరకు ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్ వేస్తుండగా భువీ తొడ కండరాలు పట్టేశాయి.
దీంతో తదుపరి మ్యాచ్‌కే కాకుండా గాయం తీవ్రత దష్ట్యా ఏకంగా లీగ్‌కే దూరమయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల పృథ్వీరాజ్‌కు ఐపీఎల్ కొత్తేం కాదు. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన ఈ పేసర్ 39 వికెట్లు పడగొట్టాడు.