ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక…లాంఛనమే

ap deputy speaker election

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఉపసభావతి (డిప్యూటీ స్పీకర్‌) ఎన్నిక మంగళవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే ఈ మేరకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ గురించి మాట్లాడిన అనంతరం సమావేశాలను స్పీకర్‌ ప్రారంభించారు. ఈ ఎన్నిక కోసం ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా ఉప సభాపతి పదవికి గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేరును ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే  ప్రకటించిన విషయం తెలిసిందే. ఎవరూ పోటీ చేసే అవకాశం లేనందువల్ల రేపు ఉదయం ఆయన ఎన్నిక లాంఛనమే అని భావించవచ్చు.