మణిరత్నంకు గుండెపోటు… హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

heartattack for manirathnam

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. తమ అభిమాన దర్శకుడికి నాలుగోసారి గుండెపోటు రావడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పలువురు సినీ ప్రముఖులు కోరారు. కాగా, 2004లో ‘యువ’ సినిమా షూటింగ్‌ వేళ, మణిరత్నంకు తొలిసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. సెట్‌ లో ఉన్న వేళ, తన ఛాతిలో నొప్పిగా ఉందని ఆయన చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. ఆపై 2015 సంవత్సరంలో ‘ఓకే బంగారం’ షూటింగ్ వేళ కాశ్్మీర్ లో, 2018లో మరోసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే హిస్టారికల్ మూవీ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే.