అదానీ సంస్థకు..190 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం.. !

AP government allocated 190 acres to Adani.. !
AP government allocated 190 acres to Adani.. !

ఏపీ సీఎం జగన్ తో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నిన్న సమావేశం అయ్యారు. దాదాపు గంటన్నర పాటు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో డేటా సెంటర్,కృష్ణపట్నం పోర్టు, గంగవరం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ సందర్భంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.

ఇక డేటా సెంటర్ ను విశాఖపట్నంలో అదానీ సంస్థ ఏర్పాటు చేస్తోంది. మొన్న మే నెలలో అదానీ డేటా సెంటర్ ను సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు . దీని కోసం 190 ఎకరాల భూమిని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది . దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను విశాఖలో అదానీ గ్రూప్ నిర్మిస్తోంది. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అదానీ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెడుతోంది . అదానీ చేతిలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని రెండు అతిపెద్ద పోర్టులు గంగవరం, కృష్ణ పట్నం ఉన్నాయి. అలాగే… 15 వేల మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ను ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అదానీ గ్రూప్.ను కలిసిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ స్థాపిస్తోంది!