బాలకృష్ణ ను ఓడించిన రవితేజ.. మరోసారి వీరి మధ్య ఫైట్..!

బాలకృష్ణ ను ఓడించిన రవితేజ.. మరోసారి వీరి మధ్య ఫైట్..!
Latest News

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉన్న విషయం తెలిసిందే. కానీ అందులో నందమూరి నటసింహం బాలకృష్ణ గారు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకు అంటే.. ఈయన చేసిన చాలా మూవీ లు హిట్ తో పాటు ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాయి. అదేవిధంగా చాలా సినిమాల్లో ఫ్లాప్ కూడా అయ్యాయి. వాస్తవానికి ఈయన హీరోగా వచ్చిన ప్రతి మూవీ ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఆయన కెరియర్ లో చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు కొన్ని సినిమాలు ఫ్లాప్స్ కూడా అయ్యాయి. బాలయ్య సినిమాలు చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. ప్రస్తుతం కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు.

బాలకృష్ణ ను ఓడించిన రవితేజ.. మరోసారి వీరి మధ్య ఫైట్..!
Balakrishna, Ravi Teja

అయితే అప్పట్లో ఆయనపై వై.వీ.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఒక్క మగాడు సినిమా బారి డిజాస్టర్ అయింది. ఇక దాంతో బాలయ్య క్రేజ్ ఒక్కసారిగా పడిపోయిందనే చెప్పాలి. ఇక అలాంటి సమయంలోనే బోయపాటి వచ్చి బాలయ్య సినీ కెరీర్ ను మళ్ళీ గాడిలోకి పెట్టేసాడు . నిజానికి ఈయన చేసిన చాలా మూవీ లు మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆ ఒక్క మగాడు సినిమా వల్ల ఆయనకి అంతకుముందు సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయిందనే చెప్పుకోవచ్చు . ఆ మూవీ తరువాత బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సింహా మూవీ సూపర్ హిట్ సాధించింది. ఇక అప్పటి నుంచి బాలయ్య క్రేజ్ పెరిగింది. ఇక బాలయ్య-బోయపాటి కాంబో అంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తుండటం విశేషం.

బాలయ్య ఒక్క మగాడు మూవీ విడుదలైన సమయంలో రవితేజ కృష్ణ సినిమా కూడా రిలీజ్ అయి బారీ హిట్ అయింది. అలాగే వీళ్లిద్దరు ఒక వారం గ్యాప్‌లో సినిమాలు విడుదయ్యాయి. మే 1న బాలయ్య ‘మిత్రుడు’ సినిమాతో పలకరిస్తే.. రవితేజ.. ‘కిక్’ మూవీతో ఆడియన్స్‌ ముందుకొచ్చాడు. ఈ సారి పోటీలో కూడా రవితేజనే పై చేయి సాధించాడు. అదేవిధంగా ఇక ఆ తర్వాత రవితేజ సంక్రాంతికి వచ్చి మిరపకాయ్ ఘాటు చూపిస్తే.. పరమవీరచక్రతో మరో డిజాస్టర్ ని ఇచ్చాడు బాలయ్య. మొత్తానికి ఇప్పటి వరకు మూడు సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డా.. వీళ్లిద్దరు ఇపుడు నాలుగోసారి తమ మూవీ లతో దసరా బరిలో సై అంటున్నారు. అక్టోబర్ 19న బాలయ్య భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రవితేజ టైగర్ నాగేశ్వర్ రావుతో అక్టోబర్ 20న బరిలోకి కూడా రాబోతున్నాడు. ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎవ్వరూ పై చేయి సాధిస్తారో వేచి చూడాలి మరీ. మూవీ లు హిట్, పట్ పక్కన బెడితే.. వీళ్లిద్దరూ బయట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ముఖ్యంగా అన్ స్తాపబుల్ షో లోకి రవితేజ వచ్చినప్పుడు ఇద్దరు కూడా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ చాలా అల్లరి చేశారు.