ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త రేషన్‌కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిన సర్కార్.. కార్డుల జారీకి ముందు రేషన్‌కార్డుకు ఈ కేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఓ గడువును కూడా విధించింది. ఏప్రిల్ 30 వరకు రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకునేందుకు గడువు విధించింది సర్కార్. అయితే ఏప్రిల్ 30 తేదీ దాటినప్పటికీ కొందరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. పలు కారణాలతో ప్రజలు ఈ కేవైసీని పూర్తి చేయలేకపోయారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి కోసం ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ కేవైసీనీ చేసుకునేందుకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఆ గడువు లోపు ఈకేవైసీని పూర్తి చేయాలని స్పష్టం చేసింది.