ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కరోనా నుంచి కోలుకున్నారు. సాధారణంగానే ఆక్సిజన్ తీసుకుంటూ వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, గవర్నర్‌కు ఈ నెల 17న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్లో చేర్పించారు.
కరోనా బారి నుంచి కోలుకున్న గవర్నర్.. ఏపీలో వరద పరిస్ధితిపై సీఎం జగన్‌తో ఫోన్లో చర్చించారు. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్ధితి, సహాయక చర్యలపై ఆరా తీసారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలని సీఎం జగన్ గవర్నర్‌కి వివరించారు. వరదల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ ప్రజలకు సూచించారు.