కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.
అదే విధంగా… తెలంగాణ సర్కార్ జూన్ 28న ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు.. ‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది. విభజన చట్టాన్ని కూడా తెలంగాణ ఉల్లంఘిస్తోంది’’ అని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది.