ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన

ap minister buggana rajendranath introduces budget

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా 2019-20 బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌ అంచనా వ్యయం వివరాలు:

బడ్జెట్‌ అంచనా రూ.2,27,974.99 కోట్లు కాగా..రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. మూలధనవ్యయం రూ.32,293.39 కోట్లు కాగా..వడ్డీ చెల్లింపుల నిమిత్తం రూ.8,994 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 19.32 శాతం పెరుగుదల ఉన్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు, ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58 కోట్లు జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు సుమారు 3.3 శాతం, జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు సుమారు 0.17 శాతంగా ఉందని తెలిపారు. పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణం కింద రూ.648 కోట్లు కేటాయించగా.. ఏపీఎస్‌ఆర్టీసీకి