బాబూ ఈ రచ్చ కొంచెం చూడవయ్యా

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గంటా VS అయ్యన్న, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కి కంటి మీద కునుకు లేకుండా చేసే అంశాల్లో ఇది మొదటిది. నిజానికి, ఈ ఇద్ద‌రి మ‌ధ్యా విభేదాలు ఇవాళ్లేం కొత్త కాదు. 2014 నుంచే ఈ ఇద్ద‌రి మ‌ధ్యా జిల్లాలో ఆధిప‌త్య పోరు మొద‌లైంది. గ‌త ఏడాది విశాఖ భూకుంభ‌కోణానికి సంబంధించిన ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన‌ప్పుడు కూడా మంత్రులిద్ద‌రూ ఇలానే పంతానికి పోయారు.

భూ కుంభ‌కోణ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఒకరి మీద ఒకరు విమ‌ర్శ‌లు చేయ‌డం, భూ కుంభ‌కోణ మీద ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే, గంటా కు సంబంధించిన వివ‌రాల‌ను సిట్ కు అయ్య‌న్న పాత్రుడు అందించార‌నే క‌థ‌నాలూ వ‌చ్చాయి. చివ‌రికి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కి ఈ పంచాయితీ చేరడంతో ఇద్ద‌రూ మాట మార్చేసి… భూదందాపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌న్న‌దే ఇద్ద‌రి అభిమ‌త‌మ‌నీ, వ్య‌క్తిగ‌తంగా త‌మ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ మీడియా ముందు చెప్పారు. అప్పటికి ఆ వివాదం సమసి పోయినా ఇప్పుడు తాజాగా గంటా అయ‌న్న మ‌ధ్య విభేదాలు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చాయి.

విశాఖ జిల్లా ప‌శుగ‌ణాభివృద్ధి సంఘానికి చెందిన పాల‌క వ‌ర్గ ఎన్నిక‌లు మ‌రోసారి ఇద్ద‌రి మ‌ధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బ‌య‌ట‌ప‌డేలా చేశాయి. అసలు విషయం లోకి వెళితే పాత పాల‌క వ‌ర్గం ప‌ద‌వీ కాలం ఇటీవ‌లే పూర్త‌యింది. సాధారణంగా అయితే ప్రతి జిల్లాలోను ఈ కమిటీలు ఉంటాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2013లో నర్సీపట్నానికి చెందిన ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు రాఘవేంద్రరావును చైర్మన్‌గా.. మరో 15 మందిని సభ్యులుగా నియమిస్తూ కమిటీని నియమించింది.

అయితే రాఘవేంద్రరావు ఇంతకుముందు కూడా ఐదేళ్లు చైర్మన్‌గా ఉన్నారు. తెలుగుదేశం 2014లో అధికారంలోకి వచ్చింది. మాములుగా అయితే పాత కమిటీలన్నీ రద్దయి.. చైర్మన్లు, సభ్యులంతా రాజీనామాలు చేయాలి. కాని విశాఖపట్నంలో అలా జర గలేదు. డీడీఎల్‌ఏ ఐదేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకుంది. దీంతో గత నెల ఐదో తేదీతో గడువు ముగిసింది. కొత్త కమిటీ వేయాల్సి వచ్చింది. అయితే, గ‌డ‌చిన ప‌దేళ్లుగా కొన‌సాగుతూ ఉన్న పాత పాల‌క వ‌ర్గాన్నే మళ్లీ కొన‌సాగించాలంటూ మంత్రి అయ్య‌న్న పాత్రుడు గ‌త నెల 19న క‌లెక్ట‌ర్ కి లేఖ రాశారు. ఈ విష‌యం ప‌శుసంవ‌ర్థ‌క శాఖ వారికి సమాచారం లేదు. దాంతో వారు ఎన్నిక‌లు నిర్వ‌హించాలంటూ 21న క‌లెక్ట‌ర్ కు లేఖ పంపారు.

దీంతో రెండు లేఖలు చుసిన ఎలా క‌లెక్ట‌ర్ కు స్పందించాలో అర్థ‌మైన‌ట్టు లేదు అందుకే మౌనంగా ఉండిపోయారు. ఇదిలా ఉంటే..కలెక్టర్ నుండి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ప‌శు సంవ‌ర్థ‌క శాఖ ఎగ్జిక్యుటివ్ చొరవ తీసుకుని.. గ‌త నెల 27న 16 మంది క‌మిటీ స‌భ్యుల‌తో క‌మిటీ నియమించారు. అయితే నియమించిన ఈ నూతన గంటా వ‌ర్గీయుల‌కు కొంత ప్రాధాన్య‌త ల‌భించింది. అయితే తాను లేఖ వ్రాసినా పట్టించుకోకుండా కలెక్టర్ నూతన వర్గాన్ని ఏర్పాటు చేయడమేమిటని మంత్రి అయ్య‌న్న ఆగ్రహించారు.

ఈ క‌మిటీలో మార్పులు చేయ‌క‌పోతే మంత్రి ప‌ద‌వి వ‌దిలేస్తా అంటూ జిల్లా ఇన్ ఛార్ మంత్రి చిన‌రాజ‌ప్ప ద‌గ్గ‌ర‌కి ఈ పంచాయితీ పెట్టారు. పంతం ప‌ట్టిన‌ట్టుగానే క‌మిటీ ర‌ద్దు చేయాల్సి వ‌చ్చి, చివ‌రికి క‌లెక్ట‌ర్ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. వీరిద్దరి పుణ్యమా అని…పటిష్టంగా ఉన్న పార్టీ ప్రతిష్ఠ అంతకంతకూ మసకబారుతున్నా…చంద్రబాబుకు మాత్రం ఏమాత్రం పట్టి నట్టు అనిపించడంలేదు.

ఇప్పటికే పలుమార్లు వీరిద్దరి విభేదాలు ముదిరి బజారున పడటం.. ప్రభుత్వ..పార్టీ పరపతి దెబ్బ తిన్నప్పటికీ చర్యలు విషయంలో బాబు ధైర్యంగా అడుగు వేయని పరిస్థితి. ఓ పక్క రాష్ట్ర ప్రయోజ‌నాల సాధ‌న కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఇలాంటి సంద‌ర్భంలో చిన్న‌చిన్న కమిటీల నియామ‌కాల పేరుతో మంత్రులే ఇలా రోడ్లేక్కితే ఇక క్రమశిక్షణ కి మారు పేరుగా చెప్పుకుంటున్న పార్టీ పరువేమి గాను ఇప్పటి కయినా చంద్రబాబు వీరని కట్టడి చేయకుంటే పార్టీ పరువు పోవడం మాత్రం ఖాయం గ కనిపిస్తోంది.