అంగన్ వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. సమ్మె పేరుతో విధులకు రానీ వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈనెల 5వ తేదీ లోపు విధులకు హాజరు కాకుంటే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. విధులకు హాజరు కానీ అంగన్ వాడీల వివరాలు సేకరించాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంపై అంగన్ వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. తమకు జీతాలు పెంచాలంటూ గత 20 రోజులుగా అంగన్ వాడీలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంగన్ వాడీలు ప్రభుత్వంతో ఓసారి చర్చలు జరపగా, అవి విఫలం అయ్యాయి. అంగన్ వాడీలు మళ్లీ సమ్మె బాట పట్టారు. దీంతో రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణీలు, శిశువులు ఇబ్బంది పడుతున్నారని, దీంతో ఇవాళ విధులకు హాజరు కావాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీలు విధుల్లో జాయిన్ అవుతారా లేక ధర్నాను అలాగే కొనసాగిస్తారో వేచి చూడాలి మరీ.