AP Politics: వైకాపా ని విడిచిపెట్టనున్న బొప్పన భవకుమార్..!

AP Politics: Boppana Bhavakumar to leave Vaikapa..!
AP Politics: Boppana Bhavakumar to leave Vaikapa..!

వైకాపా విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ పార్టీ ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారు. ఏపీ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది పార్టీలు కూడా మారారు. ఇప్పుడు తాజాగా వైకాపా విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ పార్టీ ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారు. దీంతో బుజ్జగించేందుకు దేవినేని అవినాష్ అలానే ఇతరు నేతలు కూడా అక్కడికి వెళ్లారు.

ఈ సందర్భంగా భవకుమార్ మాట్లాడుతూ.. పార్టీ విడిచి పెట్టొద్దు అంటూ నా పై తీవ్ర ఒత్తిడి ఉందని తెదేపా నేతల తోనూ సంప్రదిస్తున్నా అని చెప్పారు. నేను కార్యకర్తలు, శ్రేయోభిలాషుల తో మాట్లాడి నిర్ణయం చెప్తానని అన్నారు. వైకాపా ని విడిచి వెళ్ళడానికి, చాలా మంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గత విజయవాడ తూర్పు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన గొప్ప కుమార్ 2019 నుండి నగర అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు.