ఏలూరు జిల్లా కైకలూరులోని జగనన్న కాలనీలో నడిచేందుకు తోవ లేదు. మురుగు పారేందుకు కాలువలు ఏర్పాటు చేయలేదు. చిన్నపాటి వర్షానికే కాలనీ చెరువులా మారుతోంది. ఏ ఇంటి ముందు చూసినా మురుగునీటి కోసం గొయ్యిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ నీరు ఎండకు ఆవిరవ్వాల్సిందే గానీ బయటకు వెళ్లే మార్గం లేదు. దీంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.
కొళాయిల నుంచి కలుషితమైన నీరు వస్తుండటంతో తాగునీరు కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు. కాలనీ ముందు మాత్రం పెద్దఎత్తున స్వాగత ద్వారం నిర్మించి ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు.