AP Politics: ఈ నెల 28న బహిరంగ సభను నిర్వహించనున్న కూటమి

AP Politics: Coalition to hold public meeting on 28th of this month
AP Politics: Coalition to hold public meeting on 28th of this month

నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడులో టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. 28వ తేదీ నాటికి కూటమిలో బీజేపీ చేరే అవకాశంపై స్పష్టత వస్తుందన్న ఆయన, బీజేపీ కూడా బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉందన్నారు.

ప్రతిపక్ష కూటమి నిర్వహిస్తున్న సభలో పాలక పక్షంలో ప్రతిపక్షంగా ఉన్న తాను కూడా పాల్గొంటారు. ఇవాళో, రేపో ఈ దిక్కుమాలిన పార్టీకి తన రాజీనామాను సమర్పిస్తానని, ఆ తర్వాత ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా ఏ పార్టీ కోరుకుంటే ఆ పార్టీ అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తానని, రెండేళ్ల క్రితమే తనకున్న ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మేషన్ గా మార్చుకొని మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పానని రఘురామకృష్ణ రాజు గారు గుర్తు చేశారు.