ఏపీలో శాసనసభ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడుగురు అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో సమీక్ష సమావేశం నిర్వహిం చిం ది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్కే గుప్తా, హిర్దేశ్‌కుమార్, అజయ్‌బాదో తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా జిల్లా ఎన్నికల అధికారులను ప్రశ్నించనున్నారు.