AP Politics: నేడు ఏపీలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

AP Politics: Nara Bhuvaneshwari will visit AP today
AP Politics: Nara Bhuvaneshwari will visit AP today

నేడు ఏపీలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుంచి నిజం గెలవాలి కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొంటారు. ఇందులో భాగంగానే…10:30 – పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి నారా భువనేశ్వరి చేరుకుంటారు. 11:20 – పుట్టపర్తి నియోజకవర్గం, పుట్టపర్తి రూరల్ మండలం, నిడుమామిడి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శిస్తారు.

01:10 – గాజుకుంటపల్లి గ్రామం, ఓబుళదేవచెరువు మండలంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ, 02:45 – కదిరి నియోజకవర్గం, కదిరి టౌన్, 8వ వార్డులో కార్యకర్త కుటుంబానికి పరామర్శ, 04:15 – తనకల్లు మండలం, కొర్తికోట గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. 05:40 – ముష్టిపల్లి గ్రామం, కదిరి రూరల్ మండలంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ, 06:45 – తలపుల మండలం, తలపుల గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇక 07:50 – రాత్రి బస ప్రాంతానికి నారా భువనేశ్వరి చేరుకుంటారు.