AP Politics: “జయహో బీసీ” కార్యక్రమ వివరాలను వెల్లడించిన నారా లోకేష్

AP Politics: Come together people.. let's fight the pandemic: Nara Lokesh
AP Politics: Come together people.. let's fight the pandemic: Nara Lokesh

వ్యూహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది కదా..? ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిందని ఫైర్ అయ్యారు. ఇలాంటి సినిమాలకు జగనే డబ్బులు పంచుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే “జయహో బీసీ” కార్యక్రమం వివరాలు నారా లోకేష్ వెల్లడించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ… జనవరి నాలుగో తేదీన జయహో బీసీ వర్క్ షాప్ అని.. క్షేత్ర స్థాయిలో జయహో బీసీ కార్యక్రమాలు చేపడతామన్నారు. బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. బీసీలు బలహీన వర్గం కాదు.. బలమైన వర్గమని చెప్పారు. బీసీలే టీడీపీకి వెన్నుముక అని వివరించారు. బీసీ అభ్యున్నతికి టీడీపీ రకరకాల స్కీములు పెట్టాం….ఆదరణ, బెస్ట్ ఎవలైబుల్ స్కూళ్లు, ఫీజు రీఇంబర్సుమెంట్ వంటి వాటిని బీసీల కోసం ప్రత్యేకంగా అమలు చేశామన్నారు. వివిధ బీసీ వర్గాలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇచ్చింది టీడీపీనే అని వెల్లడించారు.