పురుష ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 80 కొత్త ఆర్టీసీ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు కు సంబంధించి చర్యలు తీసుకుంటామని…ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలు ఉచిత ప్రయాణం కల్పించారు. ఉచిత టికెట్ మీద ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని తెలిపారు.
1050 కొత్త బస్సులు 400 కోట్లతో కొనుగోలు చేస్తున్నాం…ఖాకీ బట్టలతో ఉన్న ఆర్టీసి సిబ్బంది సంస్థను కాపాడుకుంటున్నారని తెలిపారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు.. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందని వివరించారు. బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని తెలిపారు.