AP Politics: నేడు ఉమ్మడి తొలి జాబితా విడుదల చేయనున్న టీడీపీ-జనసేన..

Election Updates: Joint meeting of TDP – BJP – Janasena parties today
Election Updates: Joint meeting of TDP – BJP – Janasena parties today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఏ క్షణమైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ టిడిపి మరియు జనసేన తమ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

ఇవాళ ఏకంగా 60 నుంచి 70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం అందుతుంది. అయితే వీటిలో టిడిపికి ఎన్ని సీట్లు ? జనసేనకు ఎన్ని సీట్లు ? కేటాయిస్తారో తెలియాల్సి ఉంది. అటు బిజెపి పార్టీతో టిడిపి మరియు జనసేన పార్టీలు కూడా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే 60 నుంచి 70 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేందుకు టిడిపి మరియు జనసేన సిద్ధమయ్యాయి. దీంతో రెండు పార్టీల నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.