తక్షణమే మెగా డీఎస్సీ నిర్వహించాలని యువజన సంఘాల నాయకులు, నిరుద్యోగులు ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం ’ ముట్టడికి పిలుపునిచ్చారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని బుధవారం వీరంతా విజయవాడ నుంచి తాడేపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులను యువజన సంఘాలు నాయకులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది.