వైకాపాకు ఒకసారి ఓటేసినందుకు ఆదిమానవుల అవతారం ఎత్తాల్సి వచ్చిందని సీఎం జగన్ సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా కడప నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చకపోవడంతో మంగళవారం కడపలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆకులు కట్టుకుని ప్రధాన రహదారుల వెంట ఇలా ప్రదర్శన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రప్రభుత్వ శవయాత్రను నిర్వహించి దహనక్రియలు జరిపారు. ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.