AP Politics: వైకాపా నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేం: చంద్రబాబు

AP Politics: We can't take everyone from Vaikapa: Chandrababu
AP Politics: We can't take everyone from Vaikapa: Chandrababu

వైకాపా ముఖ్యనేతలు తెదేపాకు టచ్లోకి వస్తున్నారని.. అలాగని ఆ పార్టీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఉండవల్లిలోని నివాసంలో పలువురు పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రా.. కదలిరా.., లోకేశ్ శంఖారావం సభలతో పాటు వివిధ రాజకీయ అంశాలపై వారితో చర్చించారు. పార్టీ నేతలు యనమల, నిమ్మల, అనగాని, గొట్టిపాటి, కంభంపాటి పాల్గొన్నారు. ‘‘పొత్తులు, చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదు. వారి భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. దానికే అధిక ప్రాధాన్యత ఇస్తాం ’’ అని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా చంద్రబాబు వద్ద పార్టీ నాయకులు ప్రస్తావించారు. చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘రాజ్యసభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని పోటీకి నిలబెట్టే ఆలోచన లేదు’’అని చెప్పారు.