రాజ్యసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 27వ తేదీన ఈ ఎన్నికలు ఉన్నాయి అయితే రాజ్యసభ ఎన్నికల పోటీ కి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటున్నట్లు టాక్ వినపడుతోంది. ప్రస్తుతం టీడీపీ కి రాజ్యసభలో ఒకే ఒక సభ్యుడు కనకమేడలు రవీంద్ర ఉన్నారు వచ్చే నెలలో అయినా పదవీకాలం పూర్తి అయిపోతుంది.
తర్వాత రాజ్యసభలో టిడిపికి ప్రతినిత్యం లేనట్లే రాజ్యసభ కి ఎన్నిక కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి ప్రస్తుతం టిడిపికి 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంకో 27 మంది ఎమ్మెల్యేలు టిడిపికి కావాలి ఇంకో పక్క శాసనసభలో వైఎస్ఆర్సిపి కి ఉన్న సంఖ్య బలాన్ని బట్టి చూస్తే ఈ మూడు స్థానాలు కూడా వైసిపి పార్టీ ఖాతాలో చేరుతాయని.. ఇంకోపక్క రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైసిపి పరం అవుతాయని పొలిటికల్ సర్కిల్లో టాక్ అయితే వినపడుతోంది. టిడిపి ఆవిర్భావం నుండి ఇప్పటివరకు అంటే గత 41 ఏళ్లలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే మొదటిసారి.