AP Politics: జగన్, చంద్రబాబుకు లేఖ రాసిన వైఎస్ షర్మిల

AP Politics: YS Sharmila wrote a letter to Jagan, Chandrababu
AP Politics: YS Sharmila wrote a letter to Jagan, Chandrababu

ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై సభలో చర్చించాలని కోరారు. హామీల అమలుకు ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపాలని షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు 5.5 కోట్ల ప్రజల హక్కు. వాటిని విస్మరించి, నిర్లక్ష్యం చేసి, రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇందులో భాగంగా, విభజన హామీలు జ్ఞ్యాపకం చేస్తూ కేంద్రంపై కలిసిపోరాడాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారికి, ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడుగారికి బహిరంగ లేఖలు రాయడం జరిగిందని ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

హామీలపై అసెంబ్లీలో “ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు” తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని ఈ లేఖల్లో మా డిమాండ్ ముందుంచాము. అలాగే యావత్ అసెంబ్లీ సభ్యులకు ఇదే నా మనవి. కలసి పోరాడదాం, మీ మీ పార్టీల తరుపున అసెంబ్లీ వేదికగా ఈ చర్చ కొనసాగించండి, అసెంబ్లీ తీర్మానానికి పట్టుబట్టండి. ఇది రాజకీయాలకతీతంగా అందరం చేయాల్సిన పోరు అంటూ పేర్కొన్నారు.