తెలుగు రాష్ట్రాల నుంచి పదవులెవరికి..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడంతో.. తెలుగు రాష్ట్రాల బాధ్యతలు ఇద్దరు సమర్థులకు అప్పగించాలని బీజేపీ డిసైడైంది. వెంకయ్య తరహాలో రెండు రాష్ట్రాల్ని చూసుకునే నాయకులు లేరని అమిత్ షా భావిస్తున్నారు. అందుకే ఇద్దరు సమర్థుల్ని ఎంపిక చేశారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మురళీధర్ రావుకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. మొన్న అమిత్ షా టూర్లోనూ ఈయన ప్రధానంగా కనిపించారు. విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న మురళీధర్ రావు సైలంట్ గా పనిచేసుకుపోతున్నారు. మరోవైపు రాంమాధవ్ ఏపీలో చాప కింద నీరులా పనిచేస్తున్నారు.

క్యాబినెట్ విస్తరణలో వీరిద్దరికీ పదవులు ఖాయమని కమలం నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈశాన్యరాష్ట్రాల్లోనూ సత్తా చాటిన రాంమాధవ్.. ఏపీలో కూడా ఎత్తుగడలు వేస్తారని అమిత్ షా భావిస్తున్నారు. వీరిద్దరికీ మంత్రి పదవులు దక్కాక.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎంత బలపడతుందో తేలిపోనుంది.

మరిన్ని వార్తలు:

2024 వరకు ఫిక్సైపోయారా..?

ఎన్నారైలకు కీలక పదవులిస్తున్న ట్రంప్

కవిత మెగా ముమెంట్