ఏపీ హైకోర్టు ఎక్కడో తెలుసా ?

AP temporary High Court in Nagarjuna University

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన దిశగా మరో అడుగు ముందుకు పడింది. రాజధాని అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనం పూర్తి అయ్యే లోగా తాత్కాలిక భవనాల్లో ఏపీ హైకోర్టు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు ఏ భవనాలు వినియోగించాలి అన్నదానిపై ఓ కమిటీ ముందుగా పరిశీలన జరపనుంది. తాత్కాలిక భవనాల పరిశీలనకు నియమించిన కమిటీ ఈ నెల 10, 11 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనుంది.

ఇప్పటికే మూడు భవనాలను ప్రాధమికంగా ఈ కమిటీ పరిశీలన కోసం గుర్తించారు. విజయవాడ , గుంటూరు మధ్యన వున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కి చెందిన భవనాలతో పాటు, కృష్ణా జిల్లా కంచికచర్ల కి చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీ భవనాలు, గన్నవరం వద్ద ఇంకో భవనాన్ని ప్రాధమికంగా గుర్తించారు. ఈ మూడింటిలో కమిటీ ఏ భవనం వైపు మొగ్గుజూపితే అక్కడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా నిర్వహిస్తారు. అమరావతిలో హైకోర్టు భవన సముదాయ నిర్మాణం పూర్తి కాగానే అక్కడకి తరలివెళుతుంది. అప్పటిదాకా ఈ మూడు భవనాల్లో ఒక దానిలో హైకోర్టు ఉంటుంది.