ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత అకిరా యోషినో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అకిరా యోషినో అంచనా ప్రకారం 2021 ఏడాది చివరి నాటికి ఆపిల్ ఆటోమోటివ్ ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు అని అన్నారు. ఇప్పుడు మనం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు, నోట్ బుక్ లలో వాడుతున్న సురక్షితమైన లిథియం-అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు అకిరా యోషినోకి 2019లో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ భవిష్యత్తు గురుంచి రాయిటర్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కువ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం టెక్ దిగ్గజ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలపై పెడుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని సంస్థల కంటే ఆపిల్ ముందు ఉన్నట్లు పేర్కొన్నారు. టైటాన్ అనే ప్రాజెక్ట్ పేరుతో ఆపిల్ ఎలక్ట్రిక్ కారుపై పనిచేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా టెక్ దిగ్గజం హ్యుందాయ్ వంటి అనేక దక్షిణ కొరియా కార్ల తయారీదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే, ఆపిల్ గ్లోబల్ ఆటోమేకర్లతో సంబంధం ఉన్న చాలా నివేదికలను ఖండించింది. ప్రస్తుతం జాన్ జియాన్ ఆండ్రియా టైటాన్ అనే ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు, జియాన్ ఆండ్రియా 2018 వరకు గూగుల్ సెర్చ్ కు నాయకత్వం వహించారు. గూగుల్ కూడా త్వరలో సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొని రావొచ్చు అని యోషినో అన్నారు.