అరవింద సమేత ఆడియో డేట్‌ ఫిక్స్‌.. గెస్ట్‌ ఎవరంటే…!

Aravinda Sametha Audio Date Fix

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే విదేశాల్లో ఒక పాటను చిత్రీకరించబోతున్నారు. మరో వైపు ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా చకచక జరుగుతోంది. ఇక ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని దాదాపుగా ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతుంది. వచ్చే నెల దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కనుక సినిమా ఆడియోను ఈనెల చివరి వారంలో ఉంటుందని మొదటి నుండి ప్రచారం జరుగుతూ వస్తుంది.
aravindha-sametha-ntr
అరవింద సమేత చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను సెప్టెంబర్‌ 20న నిర్వహించబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా బ్యాక్‌ గ్రౌండ్‌లో మొదలు అయ్యాయి అంటూ సమాచారం అందుతుంది. మిగిలి ఉన్న ఒక పాటను కూడా రికార్డింగ్‌ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా బాలకృష్ణ హాజరు అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. హరికృష్ణ బతికి ఉంటే ఆయన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొనేవారు. కాని హరికృష్ణ లేని కారణంగా ఆలోటును బాలకృష్ణ భర్తీ చేస్తాడని సమాచారం అందుతుంది. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

aravindha-sametha-movie-aud