బిగ్‌బాస్‌లో క్రికెటర్‌.. వివాదం కోసం…!

Sreesanth Set To Be A Part Of Bigg Boss Season 12

హిందీ బిగ్‌బాస్‌ ఇప్పటి వరకు 11 సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున టీఆర్పీ రేటింగ్‌ వస్తున్న కారణంగా ప్రతి సీజన్‌ను మరింతగా ఆసక్తికరంగా మార్చేందుకు షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని సీజన్‌ుగా సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌ అంటూ ఇప్పటికే తేలిపోయింది. 200 కోట్లకు పైగా పారితోషికంగా సల్మాన్‌ తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ షోలో పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో షోపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తుతోంది. తాజాగా ఈషోలో మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ కూడా పార్టిసిపెంట్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
bigboss12-host-cricket
ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌ చేసినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌ కొన్నాళ్లపాటు జైల్లో కూడా ఉన్నాడు. ప్రస్తుతం బీసీసీఐ నుండి బహిష్కరణ ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌ సినిమాలు మరియు ఇతరత్ర వ్యాపారాలతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈయన్ను బిగ్‌బాస్‌ ఇంట్లోకి పంపిస్తే తప్పకుండా షోకు అదనపు ఆకర్షణ దక్కుతుందనే అబిప్రాయం అందరిలో వ్యక్తం అవుతుంది. బాలీవుడ్‌ నుండి ఎందరు ప్రముఖులు ఈ షోలో ఉన్నా కూడా వివాదాస్పద క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఉంటే ఆ కిక్‌ వేరే విధంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. శ్రీకాంత్‌కు భారీ పారితోషికం ఇచ్చి ఆయన్ను ఒప్పించారనే ప్రచారం జరుగుతుంది. త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్‌ 12 సీజన్‌లో శ్రీశాంత్‌ కనిపించడం ఖాయంగా సమాచారం అందుతుంది.

big-boss12