అరవింద సమేత సెకండ్ సాంగ్ ‘పెనివిటి’ రిలీజ్

Peniviti Lyrical Video From Aravinda Sametha

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీరరాఘవ” సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబరు 13వ తేదీన విడుదలకానున్న ఈ సినిమా ఆడియోని సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. ఇక కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి ఒక్కో లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన మొద‌టి సాంగ్‌లో పూజా హెగ్డే.. ఎన్టీఆర్‌ని చూసి టఫ్‌గా కనిపిస్తారు కానీ మాట వింటారు.. ఫర్లేదు అనే డైలాగ్ అభిమానుల‌ని అల‌రించింది. ఇక రెండో సాంగ్‌గా ‘పెనివిటి’ అంటూ సాగే పాట‌ని నేటి సాయంత్రం 4.50ని.ల‌కు విడుద‌ల చేసారు. రాయ‌ల‌సీమ స్లాంగ్‌లో ఉన్న ఈ పాట మీరూ వినేయ్యండి మరి.