అరవింద సమేత అప్‌డేట్స్‌

Aravinda Sametha Veera Raghava movie New Updates

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ రాయలసీమ యాసలో మాట్లాడనున్నాడు అని, రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం సినిమాను స్పీడ్‌గా తెరకెక్కిస్తున్నాడు. మొన్నటి వరకు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన త్రివిక్రమ్‌ ప్రస్తుతం వరంగల్‌లో చిత్రీకరణకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

వరంగల్‌ భద్రకాళి టెంపుల్‌లో అమ్మవారిని తాజాగా దర్శణం చేసుకున్న త్రివిక్రమ్‌ ఆ సమయంలోనే ఆలయంలో మూడు రోజుల షూటింగ్‌కు అనుమతిని కోరినట్లుగా తెలుస్తోంది. కొన్ని పరిధులు విధించి ఆలయ అధికారులు షూటింగ్‌కు అనుమతించడం జరిగింది. ఈ వారం లేదా వచ్చే వారంలో వరంగల్‌లో చిత్రీకరణకు రంగం సిద్దం అవుతుంది. భద్రకాళి అమ్మవారి టెంపుల్‌తో పాటు ఇంకా పలు ఏరియాల్లో, చుట్టుపట్ల ప్రాంతాల్లో కూడా చిత్రీకరణకు త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. చిత్రంలో తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో కొన్ని సీన్స్‌ ఉండబోతున్నాయి. అందుకే సీన్స్‌ను వరంగల్‌లో చిత్రీకరించాలని నిర్ణయించారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే విడుదల చేయడం జరిగింది. ఇక టీజర్‌ను అతి త్వరలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలపై క్లారిటీని ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఇవ్వలేదు. సినిమా విడుదలయ్యే వరకు ఆ విషయం సస్పెన్స్‌గా ఉంటుందేమో చూడాలి.