పంతం నెగ్గిన మాచో స్టార్ !

Pantham movie Public Talk

యాంగ్రీ యంగ్ మెన్ గోపీచంద్ నటించిన 25 వ చిత్రం పంతం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజయింది. వరస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న గోపిచంద్ పంతం ఎలాగైనా హిట్ కొట్టాలని పంతం పట్టాడు. ఇది 25 వ సినిమా కూడా కావడంతో గోపీచంద్ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రీమియర్ షో టాక్ బట్టి గోపీచంద్ పట్టిన పంతం నెగ్గినట్లే.

గత చిత్రాలకు చాలా భిన్నంగా, పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన పంతం సినిమాపై ఆడియన్స్ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెంకండ్ హాఫ్ ఎమోషనల్ గా జనాలకి ఎక్కుతుందని అంటున్నారు. చాలా కాలం తరువాత తన తనవిశ్వరూపాన్ని చూపించారు గోపీచంద్. గోపీచంద్, మెహ్రీన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా పంతం హిట్ కొట్టిందని ప్రీమియర్ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంతంతో గోపీచంద్ మరలా హిట్ కొట్టాడని అంటున్నారు.