రవితేజ – గోపీచంద్ సినిమా కోసం టాలెంటెడ్ టెక్నీషియన్స్!

రవితేజ – గోపీచంద్ సినిమా కోసం టాలెంటెడ్ టెక్నీషియన్స్!
Cinema News

మాస్ మహారాజ రవితేజ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో యాక్షన్ డ్రామా కోసం మరోసారి చేతులు కలిపారు. డాన్ శీను, బలుపు మరియు క్రాక్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న నాల్గవ సినిమా ఇది. ఈ సినిమాలన్నీ భారీ వసూళ్లు రాబట్టినవే. మేకర్స్ నేడు వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. మధ్యాహ్నం, నటుడు, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు బృందం వెల్లడించింది. ఇప్పుడు, టెక్నీషియన్లకు సంబంధించిన వివరాలను టీమ్ వెల్లడించింది. గోపీచంద్ మలినేని తన కెరీర్‌లో ఎక్కువగా థమన్‌తో కలిసి పనిచేశాదంట . దర్శకుడు మరోసారి తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు.

రవితేజ – గోపీచంద్ సినిమా కోసం టాలెంటెడ్ టెక్నీషియన్స్!
Raviteja

జీకే విష్ణు కెమెరా హ్యాండిల్ చేయనున్నారు. గమనించదగిన విషయం ఏమిటంటే, క్రాక్ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రాఫర్. సినిమాలో రిచ్ విజువల్స్‌తో మెప్పించాడు. ఈ చిత్ర బృందంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ కూడా చేరారు. తాత్కాలికంగా RT4GM అని పేరు పెట్టబడిన ఈ ప్రాజెక్ట్ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని మరియు రవి శంకర్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించనున్నారు.