పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న మూవీ ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఒక పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది . కాగా ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, వారిలో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ నటించబోతుందని తెలుస్తుంది . ప్రభాస్ సరసన కియారా అద్వానీ అంటే.. కాంబినేషన్ బాగుంటుంది. ఇక మరో హీరోయిన్ గా నయనతారని తీసుకుంటారట. గతంలో 2007లో ప్రభాస్, నయనతార ‘యోగి’ సినిమా లో జంటగా కనిపించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ మూవీ ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న మూవీ రాబోతుందని తెలుస్తుంది . అన్నట్టు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీ కోసం ఇప్పటికే సాంగ్స్ ని కంపోజ్ చేయడం స్టార్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ‘స్పిరిట్’ మూవీ కి సంబంధించిన స్పెషల్ సాంగ్ ని కూడా ఆల్ రెడీ కంపోజ్ చేశారట.