పండుగ సీజన్ వచ్చేస్తోంది. షాపింగ్ చేయాల్సి రావొచ్చు. చేతిలో లేదంటే అకౌంట్‌లో డబ్బులు ఉంటే నచ్చిన ప్రొడక్టును కొనుగోలు చేయవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే అందరి వద్ద డబ్బులు ఉండకపోవచ్చు. మరి వీళ్లేంచేస్తారు. క్రెడిట్ కార్డులు ఉంటే వాటి ద్వారా షాపింగ్ చేసి, ఆ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తుంటారు.
అయితే ఇప్పుడు క్రెడిట్ కార్డుతో కూడా అవసరం లేకుండానే రూ.లక్ష వరకు షాపింగ్ చేసేయొచ్చు. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 29 నుంచి ఈ సేల్ ప్రారంభమౌతుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు కార్డ్‌లెస్ క్రెడిట్ ఫీచర్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా రూ.లక్ష వరకు షాపింగ్ చేసి.. ఆ మొత్తాన్ని తర్వాత చెల్లించొచ్చు. ఈ సేల్ అక్టోబర్ 4న ముగుస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసిన తర్వాత బిల్లు చెల్లించే సమయంలో కార్డ్‌లెస్ క్రెడిట్ ఆప్షన్ ఎంచుకోవాలి. కార్డ్‌లెస్ క్రెడిట్ ఫెసిలిటీ కోసం ఎలాంటి డౌన్‌పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. బిగ్ బిలియన్ డేస్‌లో కార్డ్‌లెస్ క్రెడిట్‌లో భాగంగా కస్టమర్లకు మూడు పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి. వడ్డీ లేకుండా వచ్చే నెలలోనే డబ్బులు చెల్లించడం, వడ్డీ లేకుండా మూడు నెలల ఈఎంఐ ఆప్షన్, 12 నెలల ఈఎంఐ ఆప్షన్ అనేవి మూడు ఆప్షన్లు. ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. కేవైసీ ప్రాసెస్ కూడా సులభంగానే ఉంటుంది.