తరచూ నడుము నొప్పితో బాధపడుతున్నారా

తరచూ నడుము నొప్పితో బాధపడుతున్నారా

ఎండోమెట్రియాసిస్ గురించి చాలా మందికి తెలియదు. చెప్పుకు పోతే దీని గురించి చాలా విషయాలు చెప్పాలి. మరి ఇక ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎండోమెట్రియోసిస్ ఎక్కువగా అమ్మాయిలు, మహిళలని ఎఫెక్ట్ చేస్తుంది. రిప్రొడక్షన్‌కి సంబంధించిన ఏదైనా ఒక ఆర్గాన్ మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. టిష్యూస్‌కి సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే ఎండోమెట్రియాసిస్ ఎందుకు వస్తుంది అనే దానికి సమాధానం లేదు.

కానీ సాధారణంగా కనిపించే లక్షణాలు గురించి చూస్తే… పెల్విక్ పెయిన్, ఇన్ ఫర్టిలిటీ, మెన్స్ట్రుల్ సైకిల్ ఎక్కువగా ఉండటం, వికారం లేదా వాంతులు అని నిపుణులు అంటున్నారు. అయితే ఎండోమెట్రియాసిస్ గురించి చాలా మంది మహిళలకు అస్సలు అవగాహన లేదు. ఇది చాలా ఎక్కువ మందిలో వ్యాపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

బ్రెస్ట్ క్యాన్సర్ కంటే కూడా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనబడుతోంది. ఇప్పటి వరకు చాలా మంది దీని కోసం వినకపోయి ఉండొచ్చు. కానీ తప్పకుండా ఇప్పుడు తెలుసుకోవాలి. పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలకు ఎక్కువగా నొప్పి కలుగుతుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు పీరియడ్స్ సమయంలో ఇవన్నీ మామూలే అని.. కానీ ఇది సాధారణంగా వచ్చేది అని తీసి పారేస్తే తప్పు చేసినట్టే. తప్పకుండా అవసరమైతే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి.

మనిషి యొక్క నాణ్యమైన జీవితాన్ని ఇది ఇబ్బందుల్లోకి నెట్టింది. అవసరమైనంత వరకు చికిత్స తీసుకుంటూ ఉండాలి అని డాక్టర్ అంటున్నారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చియా సీడ్స్, ఫ్లేక్ సీడ్స్, వాల్ నట్స్, సాల్మన్, తాజా పండ్లు, కూరగాయలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.

అదే విధంగా ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. రెగ్యులర్ గా వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. ఎండోమెట్రియాసిస్ గురించి మరెన్నో విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి వాటి కోసం కూడా ఓ లుక్కేయండి.

ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ఎండోమెట్రియాసిస్ స్టేజ్ ఒకటిలో అయితే సమస్య చాలా తక్కువగా ఉంటుంది. పేషంట్లకి ఎండోమెట్రియాసిస్ టిష్యు తక్కువగా ఉంటుంది. పెల్విక్ ప్రాంతంలో నొప్పి కలగడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.

ఇక రెండవ స్టేజ్‌లో అయితే ఇది చాలా మైల్డ్‌గా ఉంటుంది మరియు ఈ స్టేజ్‌కి వచ్చే సరికి ఓవరీ ప్రాంతంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉండే చిన్న చిన్న adhesionsని తొలగించడం కష్టంగా ఉంటుంది. వీటిని తొలగించడానికి అల్ట్రా సౌండ్ వాడతారు.

మూడవ స్టేజ్ లో అయితే ఓవరీ ప్రాంతంలో cysts వంటివి ఉంటాయి. పెల్విస్ ప్రాంతంలో కూడా ఇవి ఉండే అవకాశం ఉంది.

ఇక నాల్గవ స్టేజ్ గురించి చూస్తే.. ఇది ఫైనల్ స్టేజ్. ఇక్కడ ఇబ్బంది మరెంత ఎక్కువగా ఉంటుంది. ఇది ఫాలోపియన్ ట్యూబ్ మరియు బౌల్స్‌లో కూడా ఉండొచ్చు. దీని కారణంగా బౌల్ మూమెంట్‌లో ఇబ్బంది ఉంటుంది.

అదే విధంగా పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా ఈ సమస్యతో బాధ పడితే తప్పకుండా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. అప్పుడే సమస్య నుండి బయట పడడానికి వీలవుతుంది. మంచి ట్రైన్డ్ డాక్టర్ల చేత సర్జరీ చేయించుకోవడం మంచిది అని డాక్టర్లు అంటున్నారు.

చికిత్స చేసిన తర్వాత రెండు నుండి మూడు రోజుల్లో పేషెంట్ ని సాధారణంగా డిశ్చార్జ్ చేస్తారని డాక్టర్స్ చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో 10 కేసులు చూశామని డాక్టర్ అంటున్నారు.

గత తొమ్మిది నెలల నుండి చూసుకుంటే వంద మంది ఈ ఎండోమెట్రియాసిస్ సమస్యతో బాధ పడినట్టు గుర్తించారు. దిగ్విజయంగా 56 కేసులు చూశామని కూడా చెప్పారు. 25 శాతం మంది ఈ సమస్యతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. అయితే 90 శాతం మంది ఈ నొప్పితో బాధపడ్డారని డాక్టర్ అన్నారు.

కాబట్టి ఏది ఏమైనా ఆడవాళ్ళు ఇటువంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. మీకు వచ్చే లక్షణాలను బట్టి, ఇబ్బందిని బట్టి మీరు డాక్టర్‌తో చెప్పి ఈ సమస్య నుండి బయట పడటం మంచిది.

ఏ సమస్య అయినా సరే సరైన ట్రీట్మెంట్‌తో తొలగిపోతుంది. ఒకవేళ కనుక మీరు సాధారణంగా వస్తోందని ఎక్కువ ఇబ్బంది ఉన్నా పట్టించుకోకుండా ఉంటే సమస్య మరింత పెద్దదవుతుంది. దీని వల్ల మరెన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి చిన్నపాటి సమస్యలను కూడా వదిలేయకుండా మంచి స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేసి ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టండి లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులకు ఇది దారి తీస్తుంది.