మోడీనా ఆయనెవరు ? మాకు తెలీదే !

ARI Survey says 75% Canadians do not know Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లోభారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఒకరు. ప్రపంచంలోనే ఎక్కువదేశాల్లో పర్యటించిన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన మోడీ అంటే ఎవరో 75 శాతం మంది కెనడా ప్రజలకు తెలియదట. ఆ దేశంలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రపంచ నేతల గురించి కెనడా ప్రజలకు ఏ మేరకు తెలుసనే దానిపై ‘అంగుస్‌ రైడ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఏఆర్‌ఐ) ఇటీవల ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోడీ గురించి కెనడావాసులకు తెలియదంటే ఆశ్చర్యం కలుగకమానదు.

ఆ సర్వే నివేదిక ప్రకారం… 75శాతం మంది కెనడావాసులు అసలు మోదీ ఎవరో తమకు తెలియదని చెప్పారు. కొంతమంది మాత్రం ఆయనను గుర్తించారు. భారత్ అంటే ఎంతో ఇష్టపడే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కుటుంబ సమేతంగా ఈ మధ్యనే భారత్ పర్యటించాడు. ఆ సమయంలో ప్రధాని మోదీని కూడా కలిసిన విషయం తెలిసిందే. అయినా కూడా మన ప్రధాని మోడీగారు ఎవరో తెలియదు అనడం భాజాపీయులకి కాస్త షాకింగ్ విషయమే.