ఆంధ్రాలో సరికొత్త మహాకూటమి ?

BJP Plans to Alliance with YSRCP and Janasena in Andhra Pradesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం అప్పుడే వేడెక్కుతోంది. ప్రధాని మోడీ వ్యతిరేక శక్తులు అన్ని ఒక్కటి అవుతున్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ సహా మెజారిటీ ప్రాంతీయ పార్టీలు ఒక్క చోటుకు చేరుతున్నాయి. అందరి లక్ష్యం ఒక్కటే మోడీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మోడీ మళ్లీ అధికార పీఠం ఎక్కాలని ఎన్నో శక్తులు ఆశిస్తున్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఇంత ద్రోహం చేసిన బీజేపీ కి ఇక్కడ జనంలో అంత మద్దతు ఉందా అని ఆశ్చర్యపోనక్కర్లేదు. జనాల్లో బీజేపీ మీద గొంతు దాకా కోపం వుంది. రాజకీయ పక్షాల్లో మాత్రమే స్వార్ధ చింతన వుంది. అయితే ఆ పార్టీలు మాత్రం తాము రాజకీయాలు చేయాల్సింది ఓట్లు వేయాల్సిన జనంతో అన్న విషయం మర్చిపోయి మోడీని ఢీకొంటున్న చంద్రబాబుని ఓడించాలని తెగ ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగమే ఆంధ్రాలో సరికొత్త మహాకూటమికి ఏర్పాట్లు సాగుతున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ, వైసీపీ, జనసేన ఇప్పుడు వేర్వేరుగా చంద్రబాబు మీద యుద్ధం చేస్తున్నారు. ఇక ఆ ముగ్గురు ఒక్క తాటి మీదకు రావడం మాత్రమే మిగిలివుంది. ఆ ఘట్టం కూడా పూర్తి చేయడానికి ప్రధాని మోడీ ఇప్పటికే వ్యూహం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురితో ఇంకో ఆరు నెలల్లో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే లోపాయికారీ పనులు మొదలు అయ్యాయట. అంతా అనుకున్నట్టు అయితే ఆ సభ డిసెంబర్ 22 న తిరుపతి లో జరుగుతుందట. ఈ సరికొత్త మహాకూటమి ఏర్పాటు చేయడం అంత కష్టం కాదు గానీ దానికి ప్రజామద్దతు కూడగట్టడం చాలా కష్టం అని ప్రజానాడి చెబుతోంది. చూద్దాం… ఏమి జరుగుతుందో ?