అబ్బే.. అవి పుకార్లే అండి!

rumours about ntr and cominden srinivas reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో కమెడియన్‌ శ్రీనివాసరెడ్డితో ఎన్టీఆర్‌ అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది. చాలా కాలంగా ఎన్టీఆర్‌కు శ్రీనివాసరెడ్డికి మద్య విభేదాలు ఉన్నాయి. ఆ కారణంగానే ఎన్టీఆర్‌ తన సినిమాల్లో ఆయనకు ఛాన్స్‌ ఇవ్వనివ్వడు. కాని త్రివిక్రమ్‌ తన ప్రతి సినిమాలో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా శ్రీనివాసరెడ్డికి ఛాన్స్‌ ఇచ్చాడు. దాంతో శ్రీనివాసరెడ్డితో సీన్స్‌ సమయంలో కాస్త ఈగో ఫీల్‌కు గురి అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మీడియాలో వచ్చిన వార్తలను కొట్టి పారేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్‌ సెల్ఫీని విడుదల చేయించాడు.

మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు చిన్న సెల్ఫీతో క్లారిటీ ఇచ్చేశాడు. దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు ఎన్టీఆర్‌, శ్రీనివాసరెడ్డిలు ఉన్న ఒక సెల్ఫీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతుంది. ఆ ఫొటోతో గత కొన్ని రోజులుగా వస్తున్న విమర్శలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇద్దరి మద్య వివాదం నిజమే అయినా కూడా, సినిమా ఇమేజ్‌ డ్యామేజ్‌ అవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ ఇలాంటి మంచి స్టెప్పు తీసుకున్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. ఇలా సెల్ఫీ తీసుకున్నంత మాత్రాన ముందు ముందు ఇద్దరు కలిసి పోయినట్లే అని, ఎన్టీఆర్‌ సినిమాలో ఇకపై శ్రీనివాసరెడ్డి ఉంటాడు అనుకోవడానికి లేదు అంటూ కొందరు అంటున్నారు. ఈ సినిమా వరకు వివాదం సర్దుమనిగినట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.