జంబలకిడిపంబ : టెన్త్ చదివే కుర్రాడి మీద ఎదురింటామె లైంగిక దాడి

Women rape attempt on 15-years-old Boy at Vijayawada

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై అత్యాచారాల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది మహిళలు మృగాళ్ళ చేతిలో నలిగిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో నిందితుల మీద కటినంగానే వ్యవహరిస్తోంది. అయితే విజయవాడలో మాత్రం సీన్ రివర్స్ అయింది. జంధ్యాల తీసిన జంబలకిడిపంబ సినిమాలో మగాళ్ళు ఆడవాళ్ళలా ఆడవాళ్ళూ మగాళ్ళలా ప్రవర్తించడం చూశాం… దానిని చూసి స్ఫూర్తి పొందిందో లేక మగవాళ్ళకి మేమేమన్నా తక్కువ తిన్నామా అనుకుందో ఏమో 14 ఏళ్ల బాలుడిపై 40 ఏళ్ల ఓ వివాహిత లైంగిక దాడికి యత్నించింది. తన ఇంట్లోకి పిలిచి, అత్యాచారయత్నం చేసింది. విజయవాడ నగర శివారులోని నున్నలో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయకాపురంకి చెందిన ఓ మహిళకి భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు.

ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్లిద్దరికీ వివాహం చేసి అత్తారింటికి పంపేసింది. అప్పటి నుంచి ఆమె ఒంటిరిగా ఉంటోంది. ఆమె ఇంటి ఎదురుగా ఉంటున్న పదిహేనేళ్ల బాలుడు ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశాడు. ఇరుగుపొరుగు అనే చొరవతో రోజూ ఆ బాలుడు ఆ మహిళ ఇంటికి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో అతనితో ఆమె అసభ్యకరంగా ప్రవర్తిస్తోంది. పైగా పిలిచినప్పుడల్లా తన వద్దకు రావాలని ఒత్తిడి చేయడంతో ఆ బాలుడు భయపడిపోయాడు. అప్పటి నుంచి ఇంట్లో కూడా ఉండడం మానేసి దూరంగా ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇంటికి రావకపోవడానికి కారణమేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే దాటవేస్తున్నాడు. ఈ క్రమంలో వారు బాలుణ్ణి గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన విషయం చెప్పాడు.

దీంతో బాలుడి తల్లి ఆ మహిళపై చేయి చేసుకుంది. దీంతో ఆ మహిళ నున్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో బాలుడి తల్లిపై ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు బాలుడి తల్లిదండ్రులను పిలిపించి విచారించగా, వారు అసలు విషయం చెప్పారు. ఫోక్సా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. వైద్య పరీక్షల కోసం బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆమెకు 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.