అప్పుడు మిస్‌ అయ్యింది.. ఇప్పుడు కన్ఫార్మ్‌ అయ్యింది

Vidya Balan finally signs Balakrishna NTR biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో విద్యాబాలన్‌ను నటింపజేసేందుకు విశ్వ ప్రయత్నాలు జరిగాయి. బాలయ్య కోరిక మేరకు పలు సార్లు ఆమెతో క్రిష్‌ చర్చలు జరిపాడు. ప్రాముఖ్యత లేని పాత్రను తాను పెద్దగా పట్టించుకోను అంటూ తెగేసి చెప్పేసింది. సౌత్‌లో తాను సినిమా చేయాలి అంటే అదో అద్బుతమైన సినిమా అయ్యి ఉండాలి, అలాగే మంచి పాత్ర అయ్యి ఉండాలి అంటూ అప్పుడు క్రిష్‌కు విద్యాబాలన్‌ సమాధానం చెప్పింది. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో ఆమెను మిస్‌ అయిన బాలకృష్ణ తాజాగా తాను చేయబోతున్న ‘ఎన్టీఆర్‌’ సినిమా కోసం మళ్లీ ప్రయత్నించాడు. విద్యాబాలన్‌తో ఈసారి బాలయ్యకు జోడీ కుదిరినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్‌ చిత్రంలో నటించేందుకు విద్యాబాలన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందబోతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉంది. కాని దర్శకుడు తేజ మద్యలో వదిలేసి వెళ్లడంతో పాటు, స్క్రిప్ట్‌ వర్క్‌ ఆలస్యం వంటి కారణంగా సినిమా ఆలస్యం అయ్యింది. దానికి తోడు దర్శకుడు క్రిష్‌ ఈ సినిమా చేయాలని బాలయ్య పట్టుబట్టాడు. దాంతో ఆయన ‘మణికర్ణిక’ పూర్తి చేసి వచ్చి ఈ సినిమాను చేయబోతున్నాడు. బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు క్రిష్‌ రిక్వెస్ట్‌ చేయడంతో ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో విద్యాబాలన్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. భారీ పారితోషికంతో పాటు, ఆమెకు సమానమైన గౌరవంను సెట్స్‌లో చూపిస్తామని, అలాగే తక్కువ డేట్లు కేటాయించినా చాు అంటూ క్రిష్‌ హామీల వర్షం కురిపించడంతో ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్టీఆర్‌ భార్య బసవతారకంగా విద్యాబాలన్‌ కనిపించనుంది.