‘కన్నప్ప’లో అరియానా, వివియానా: అభిమానులకు కొత్త సర్‌ప్రైజ్!

Ariana, Viviana in 'Kannappa': A new surprise for fans!
Ariana, Viviana in 'Kannappa': A new surprise for fans!

మంచు ఫ్యామిలీ నుంచి మరో తరం తెరపై సందడి చేయడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే, హీరో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్‌ ‘కన్నప్ప’లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ సినిమా లో కనిపించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. వీరికి సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.

Ariana, Viviana in 'Kannappa': A new surprise for fans!
Ariana, Viviana in ‘Kannappa’: A new surprise for fans!

ఈ సందర్భంగా ‘కన్నప్ప’తో నా మనవరాళ్లు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందిస్తున్నాను. నటనపై వాళ్లకి ఉన్న అభిరుచి చూసి నాకెంతో గర్వంగా ఉన్నది . పరిశ్రమలో వారికి గుర్తింపురావాలని ఎంతోమందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా’ అని మోహన్ బాబు పోస్ట్‌ పెట్టారు.

‘కన్నప్ప’ మూవీ విషయానికొస్తే.. మంచు విష్ణు టైటిల్‌ పాత్రలో ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న పాన్‌ ఇండియా మూవీ ఇది. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్‌ కథానాయిక. ప్రభాస్, అక్షయ్‌ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.