మహేష్ కి కథ చెప్పబోతున్న రెడ్డి.

Arjun reddy director sandeep ready to story for Mahesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఓ సక్సెస్ ఫుల్ మూవీ కి డివైడ్ టాక్ రావడం అరుదు. ఈ మధ్య కాలంలో ఆ ఘనత అర్జున్ రెడ్డి కి దక్కింది. ఈ సినిమా సూపర్ అని కొందరు, ఇంత చెత్త సినిమా ఎలా తీశారు అని మరికొందరు అంటున్నారు. దీంతో సినీ లవర్స్ కి ఇప్పుడు హాట్ టాపిక్ అర్జున్ రెడ్డి బాగుందా, బాగా లేదా అన్న డిస్కషన్ మాత్రమే. సహజంగా అర్జున్ రెడ్డి ప్రభావం ఆ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి మీద కూడా పడింది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఆయన వైపు ఆసక్తిగా చూస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా లాగానే ఆయన కూడా కాస్త మొండిఘటం అనిపిస్తున్నాడు. తొలి సినిమా షూటింగ్ టైం లోనే దానికి పనిచేసిన వారితో వచ్చిన గొడవల గురించి ఆయనే బయటికి చెప్పాడు. ఆ మాటల్లో సినిమా రంగంలో కనిపించే లౌక్యం కాస్త తక్కువ, నిర్మొహమాటం ఎక్కువ కనిపిస్తున్నాయి.

అర్జున్ రెడ్డి సినిమా నచ్చిందో, ఆ డైరెక్టర్ సందీప్ రెడ్డి మాటల్లో గట్స్ నచ్చాయో గానీ మహేష్ బాబు కూడా ఆయన్ని తెగ మెచ్చుకున్నాడట. అంతటితో ఆగకుండా తనని కలిసే ఛాన్స్ కూడా ఇచ్చాడట. ఆ ఛాన్స్ ని ఓ కథ చెప్పడానికి వాడుకోడానికి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి రెడీ అవుతున్నాడు. అయితే గత అనుభవాలు చూస్తే ఇలాంటి విషయాలు ఓ ట్రాక్ ఎక్కడం అంత తేలిక కాదు అని అర్ధం అవుతుంది. ఒకప్పుడు స్వామి రారా సినిమా చూసి దర్శకుడు సుధీర్ వర్మ కి టాప్ స్టార్స్ చాలా మంది ఫోన్ చేశారు. కానీ రిజల్ట్ ఏమిటో అందరికీ తెలుసు. అందుకే మహేష్ పిలుపుని సందీప్ కూడా కథ చెప్పుకోడానికి ఓకే . కానీ ఎక్కువ ఆశలు పెట్టుకుంటే నిరాశ తప్పదు.

మరిన్ని వార్తలు:

హీరోలందరిలో రానా ప్రత్యేకం..!

ఆ ఆహ్వాన పత్రిక చూసి బ్రహ్మి ఫేస్ లో నో బ్లడ్.

నారా నానమ్మ స్పీచ్ కి మనవడి చప్పట్లు.