Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవరైనా ఓ కార్యక్రమానికి సంబంధించి మనకు ఆహ్వాన పత్రిక పంపితే సంతోషిస్తాం. ఆ ఆహ్వాన పత్రికలో మనకు ప్రత్యేక స్థానం కల్పిస్తే ఇంకాస్త సంతోషిస్తాం. ఇక ఆ ఆహ్వాన పత్రికలో ఉద్దండుల ఫోటోల మధ్య మన ఫోటో కూడా వేస్తే ఆ సంతోషానికి అవధులు వుండవు. కానీ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయినా ఆయన మోహంలో సంతోషం మాట దేవుడెరుగు నెత్తుటి చుక్క లేకుండా పోయిందట. ఇలా ఎందుకు అయ్యిందో, ఆ కథ కమామీషు ఏంటో చూద్దామా…
ఈనెల 17 న కళాబంధు సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకలు విశాఖ లో ఘనంగా జరగబోతున్నాయి. ఆ వేడుకలకు బ్రహ్మికి కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ వేడుకకి సినీ రంగం నుంచి వచ్చే భక్తుల స్థానంలో అతిరధ, మహారథుల మధ్య బ్రహ్మి ఫోటో కూడా వేశారు. అయినా బ్రహ్మి కి ఆ ఆహ్వానం చూడగానే బాధ కలిగి ఉంటుంది. ఎందుకంటే… ఆ జాబితాలో మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది చిత్ర సీమకి దూరం అయిన వాళ్ళే. అలనాటి నటీనటులు జమున, సరోజ దేవి , వాణిశ్రీ, శారద, కాంచన, సుమలత, కృష్ణం రాజు, మోహన్ బాబు సరసన బ్రహ్మి ఫోటో వుంది. వీరిలో 90 శాతం మంది వెండితెరకి దూరం అయినవాళ్లే. మిగిలిన 10 శాతం ఏదో సరదాగా తమకు నచ్చిన వేషం వస్తేనే వేసేవాళ్ళు.
అసలే కామెడీ రాజుగా సినీ రంగాన్ని ఏలి ఇప్పుడు ఖాళీగా కూర్చోడానికి ఇబ్బంది పడుతున్న బ్రహ్మి కి ఇలాంటి కార్యక్రమాలు కొంత ఉపశమనం ఇస్తాయి అనుకుంటే ఏకంగా వెటరన్స్ సరసన ఫోటో వేయడంతో మోహంలో నెత్తురు చుక్క లేకుండా పోయిందట. ఒకప్పుడు తన హవా సాగుతున్నప్పుడు బ్రహ్మి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఇప్పుడు ఆయన పరిస్థితి చూసి తగిన శాస్తి జరిగిందని కామెంట్ చేసుకుంటున్నారు. ఇలా అనుకునే వాళ్లలో సాటి నటులతో పాటు కొత్త నిర్మాతలు, దర్శకులు ఎక్కువగా ఉన్నారట.
మరిన్ని వార్తలు: