బిగ్‌బాస్‌పై కామెంట్స్‌ చేసిన హైపర్‌ ఆది

hyper-aadi-sensational-comments-on-bigg-boss-show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హైపర్‌ ఆదికి ఇప్పుడు వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. జబర్దస్త్‌ కమెడియన్స్‌లో అతి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్‌ను దక్కించుకున్న హైపవర్‌ ఆది కొన్ని సందర్బాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వివాదంలో తల దూర్చుతున్నాడు. మద్య రాజకీయాల గురించి మాట్లాడి అధికార టీడీపీ నాయకులకు కోపం తెప్పించిన హైపర్‌ ఆది తాజాగా కాస్త అతిగా మాట్లాడి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాడు.

తాజాగా హైపర్‌ ఆది ‘మేడ మీద అబ్బాయి’ అనే చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇంతకు ఆది ఏమన్నాడంటే ఎన్ని రియాల్టీ షోలు వచ్చినా, ఎన్ని ఇతర షోలు వచ్చినా కూడా జబర్దస్త్‌ మీదకు రాలేవని, అవన్ని ఇలా వచ్చి అలా వెళ్లేవే అని, జబర్దస్త్‌ మాత్రం ఎప్పటికి ఉండేది అన్నాడు. ఆ వ్యాఖ్యల్లో గూడార్థం ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ను కించపర్చే విధంగా ఉందని కొందరు ఆదిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌లో ఛాన్స్‌ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అని, తనకు బిగ్‌బాస్‌ కంటే కూడా అధికంగా జబర్దస్త్‌ ముఖ్యమని, జబర్దస్త్‌ వారు మెడపట్టి గెంటేసే వరకు తాను అక్కడే ఉంటానని, బుల్లి తెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆయనకు లైఫ్‌ ఇచ్చిన జబర్దస్త్‌ను పొగడుకోవడంలో తప్పులేదు, ఆ సమయంలో ఇతర షోలను కించపర్చే విధంగా మాట్లాడటం సమంజసం కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

రాజ‌మౌళికి ఏఎన్నార్ అవార్డ్

ఎన్టీఆర్‌ శతమానంభవతి వర్కౌట్‌ అయ్యేనా?

ఎన్టీఆర్‌కు పెద్ద షాక్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌